Sekhar Basha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం రెండో వారం కూడా పూర్తి అయింది. ఇక రెండవ వారంలో భాగంగా ఊహించిన విధంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు రాగా రెండవ వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు నిజానికి శేఖర్ బాషా ఓటింగ్ పరంగా కిరాక్ సీత పృథ్వి కంటే ముందు ఉన్నారు అయినప్పటికీ ఈయన ఎలిమినేట్ అయ్యారు.

ఈ విధంగా శేఖర్ భాష ఎలిమినేట్ కావడంతో పలువురు ఇది ఫేక్ ఎలిమినేషన్ అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై శేఖర్ భాష క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఎలిమినేట్ చేయమంటూ బిగ్ బాస్ ని వేడుకున్నానని, ఇది బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్ అంటూ ఈయన అసలు విషయం వెల్లడించారు.

నా కొడుకును చూసేందుకు నేను అడిగి బిగ్‏బాస్‏ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను. అలాగే నాకు కొంచెం ఫుడ్ కూడా ప్రాబ్లమ్ అయ్యింది. హౌస్ లో అందరూ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. ఇక నేను మరింత ముందుకు వెళ్లాలి అంటూ నాకు ఓట్లు వేసిన అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈయన కామెంట్స్ చేశారు.

కొడుకు పుట్టడంతో..
గత మూడు రోజుల క్రితం శేఖర్ భాషకు కుమారుడు పుట్టారు. ఇదే విషయాన్ని నాగార్జున శనివారం ఎపిసోడ్లో వెల్లడించారు. దీంతో తన కొడుకును చూడటం కోసం శేఖర్ భాష ఇలా స్వయంగా బిగ్ బాస్ ను అడిగిమరీ బయటకు వచ్చారనే విషయం తెలియడంతో నేటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం మొత్తం ఓట్లు వేసిన వాళ్ళం పిచ్చోళ్ళమా అంటూ మండిపడుతున్నారు.