కొన్నిసార్లు ఆఫీసులో నిద్రపోవడం ఇబ్బందికి కారణంగా ఉంటుంది. పగటిపూట, ఆఫీస్‌ల్లో నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర లేకపోవడమే. 6 నుంచి 8 గంటలు నిద్రపోకపోతే.. మీ నిద్రకు పదే పదే అంతరాయం కలిగితే.. ఈ కారణంగా రోజంతా నిద్రపోతున్నట్లు, సోమరితనంగా అనిపించవచ్చు. అంతే కాకుండా కొన్ని ఆనారోగ్య సమస్యలైనా డిప్రెషన్, యాంగ్జయిటీ, లూపస్, స్కిజోఫ్రెనియా, పార్కిన్సన్స్ డిసీజ్, మల్టిపుల్ స్క్లెరోసిస్, హైపోథైరాయిడిజం వంటి సమస్యల కారణంగా పగటిపూట ఎక్కువ నిద్రపోవడం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నార్కోలెప్సీ వంటి నరాల సంబంధిత రుగ్మతలు కూడా ఒక సమస్య. దీని కారణంగా పగటిపూట నిద్రలేమి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వ్యాధిలో మెదడు నిద్ర-మేల్కొనే చక్రాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతుంది. ఎక్కువసేపు నిద్రపోవడానికి ఇదే కారణం. అంతేకాదు డిమెన్షియా వంటి వ్యాధుల వల్ల కూడా పగటిపూట నిద్రలేమి సమస్య కొనసాగుతుంది. మీరు ఈ సమస్యతో పోరాడుతున్నట్లయితే.. దీనికి ఒక కారణం మధ్యాహ్నం అధికంగా భోజనం చేయడం. తెల్ల రొట్టె, అన్నం, స్వీట్ స్నాక్స్ వంటి వాటిని తినడం వల్ల ఎక్కువ నిద్ర, శక్తి పోతుంది. ఆఫీస్‌లో పదే పదే నిద్రపోతున్నట్లు అనిపిస్తే.. దాన్ని వదిలించుకోవడానికి కెఫిన్ ఉన్న వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. కెఫిన్ తక్షణ శక్తిని ఇస్తుంది. మానసిక కార్యకలాపాలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
[vuukle]