• జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్

  • కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్

  • యూనియన్ బై లాస్ ప్రకారం జానీ మాస్టర్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న కొరియోగ్రాఫ

Jani Master to be revoked as Choreographers Association President: జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు విషయంలో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఇక ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ఒక కీలక ప్రకటన చేసింది. ఇక ఈ క్రమంలో రేపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు జానీ మాస్టర్. సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో.. సమావేశం రేపటికి వాయిదా పడింది. జానీ మాస్టర్ అంశంపై రేపు అసోసియేషన్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. యూనియన్ బై లాస్ ప్రకారం జానీ మాస్టర్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Siddharth-Adithi Rao Hydari: అదితి రావు – సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్న 400 ఏళ్ల నాటి గుడి రహస్యం ఏంటో తెలుసా?

జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని జానీ దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవుట్‌డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాలకు వెళ్ళినప్పుడు తనపై అత్యాచారం చేశాడని, అలాగే హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది సదరు మహిళ. మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతని పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.