సీఎం రేవంత్: 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటే త్యాగం.. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య అంటూ కొనియాడారు. ఈ మేరకు సెప్టెంబర్ 17ను ఇకపై ‘ప్రజా పాలన దినోత్సవం’గా పిలవాలని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. నాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా. తెలంగాణ ప్రజలకు ‘ప్రజా పాలన దినోత్సవ’ శుభాకాంక్షలు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు.