• త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ పూనమ్

  • మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్

  • త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇచ్చిన కంప్లైంట్

గతంలో కొన్నిసార్లు ప్రత్యక్షంగా కొన్నిసార్లు పరోక్షంగా గురూజీగా పిలవబడే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ పూనమ్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో పూనమ్ కౌర్ తొలుత జానీని మాస్టర్ అని పిలవకండి, మాస్టర్ అని పిలవాలంటే దానికి కాస్త గౌరవం ఉంచాలి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆ వివాదం సద్దుమణగక ముందే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇచ్చిన కంప్లైంట్ అసలు తీసుకున్నారా అని ఆమె ప్రశ్నించింది.

Also Read: Jani Master: జానీ మాస్టర్ పై ముందు సెక్సువల్ హరాస్మెంట్ కంప్లైంట్ రాలేదు.. కానీ?

నాకు అలాగే కొంతమందికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవచ్చు నన్ను అందుకే సైలెంట్ గా ఇగ్నోర్ చేశారు. నేను అప్పుడు ఉన్న హెడ్స్ కి కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రశ్నించాలని ఆమె కోరారు. గతంలో కూడా పూనం త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే తనకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు లేకుండా పోయాయని ఆరోపణలు గుప్పించారు. చాలా సందర్భాలలో ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు నేరుగా ప్రస్తావించగా కొన్ని సందర్భాలలో గురూజీ అంటూ ఆమె పరోక్షంగా కౌంటర్లు వేస్తూ ఉండేవారు. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం వాడి వేడిగా సాగుతున్న సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మీదకు తీసుకురావడం హాట్ టాపిక్ అవుతోంది.