• కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల విషయంపై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది.
  • ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడని.
  • ఈ కేసులో ఆ అమ్మాయి పోరాడేందుకు కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా..

Chinmayi Sripada: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. ఆవిడ పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ..‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడని., ఈ కేసులో ఆ అమ్మాయి పోరాడేందుకు కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. ఇకపోతే ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi sripada) ఒక ఫెమినిస్ట్ అనే విషయం తెలిసిందే. ఆవిడ కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. సమాజంలో ఎక్కడైనా సరే అమ్మాయిలకు, చిన్న పిల్లలకు ఇబ్బందులు ఎదురయ్యాయి అంటే వెంటనే అందుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. వాటి గురించి తెలిపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

Big Breaking: ఖైరతాబాద్‌ గణేష్ విగ్రహం వద్ద భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన..

ఈ మధ్య కాలంలో రచయిత వైరముత్తు, సింగర్ కార్తీక్‌పై కూడా వేధింపుల ఆరోపణలు చేశారు. ఆడవారిపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న సమయంలో బాధితులు ఒక్కొక్కరిగా తమ బాధను చెప్పుకుంటున్న కారణంగా వారికి అండగ నిలుస్తోంది ఈ సింగర్. ఇదిలా ఉండగా.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ (Johnny master) పై అత్యాచార ఆరోపణలు వెలుగులోకి రావడంతో బాధిత యువతకి అండగా నిలుస్తూ ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Drug-Resistant Superbugs: ముంచుకొస్తున్న సూపర్‌బగ్ ముప్పు.. 2050 నాటికి 40 మిలియన్ల మంది మృతి..!

2017లో ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమైన డాన్స్ షోలో భాగంగా ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి, ఆ అమ్మాయిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం మనకి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వగా.. అందులో ఆమె వయసు 21 సంవత్సరాలు మాత్రమే అంటూ తెలిపింది.