Translate this News:
Health Tips: ఆయుర్వేదం ప్రకారం.. ఆకులు, చెట్ల వేళ్లల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకులు, చెట్ల వేళ్లతో చేసే కషాయాలు, మెడిసిన్ తీసుకోమంటారు. అయితే ఆంజీర్ పండ్లు ఖరీదైన డ్రై ఫ్రూట్స్ అని మనందరికి తెలుసు. కానీ మార్కెట్లో అంతకంటే ఎక్కువగా అంజీర్ ఆకులకు డిమాండ్ ఉందట. వీటి ధర రూ. 2 నుంచి 3 వేల వరకు ఉంటుంది. అంజీర్ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అంజీర్ పండ్ల కంటే ఆకులను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదట. ఈ ఆకులు జీర్ణశక్తిని బలోపేతం చేయడంతోపాటు గుండె జబ్బులు, మధుమేహాన్ని అరికడుతుంది. అంజీర్ ఆకులు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..
అంజీర్ ఆకుల వల్ల ప్రయోజనాలు:
- అంజీర్ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆకులు తీసుకుంటే కడుపులోని మలినాలు తొలగిస్తుంది. దీనివల్ల కడుపు సమస్యలు, మలబద్ధకం తగ్గిస్తుంది. అంజీర్ ఆకులు ప్రీబయోటిక్‌గా పనిచేస్తాయి. కడుపులో అనేక రకాల సమస్యలను తగ్గించే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. అంజీర్ ఆకులకు రక్తపోటును తగ్గించే శక్తి అధికంగా ఉంది. ఈ ఆకులు అధిక రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంజీర్ ఆకులకు రక్తంలో చక్కెర, మధుమేహాన్ని నియంత్రించే సామర్థ్యం ఉంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అంజీర్ ఆకులను నమిలి తింటే రక్తంలో చక్కెర శాతాన్ని బాగా తగ్గుతుంది.
అంజీర్ ఆకులు తినే విధానం:
- అంజీర్ ఆకులను ఉదయాన్నే తినాలి. అల్పాహారం తీసుకునే ముందు కొన్ని ఆకులను నమలడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. దీన్ని ఉడికించి, టీ లాగా తయారు చేయవచ్చు. దీనికోసం నీటిని మరిగించి అందులో అంజీర్ ఆకులను వేసి టీ తయారు చేసి తాగాలి. పాశ్చాత్య దేశాల్లో అంజీర్ ఆకుల టీ చాలా ఫేమస్.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
[vuukle]