J&K అసెంబ్లీ ఎన్నికలు: జమ్మూ కాశ్మీర్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా మొత్తం మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో.. కాశ్మీర్ లోని నాలుగు జిల్లాల్లో 16 నియోజకవర్గల్లో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు 90 మంది స్వతంత్రులతో సహా 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.