• మరాఠీ పదాన్ని తప్పుగా ఉచ్చరించిన అమితా బచ్చన్
  • క్షమాపణలు చెప్పిన షాహెన్‌షా ఆఫ్ బాలీవుడ్

‘గ్రేట్ హీరో ఆఫ్ ది సెంచరీ’, ‘షాహెన్‌షా ఆఫ్ బాలీవుడ్’ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం తన టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్‌తో అందరినీ అలరిస్తున్నారు. షోలతో పాటు ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. కాగా.. ఇటీవల, అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సందేశాలు ఇస్తూ కనిపించారు. ఆ వీడియోలో ఇలా అన్నాడు.. “నమస్కార్ మెయిన్ హూన్ అమితాబ్ బచ్చన్, మీ కచ్రా కర్నార్ నహీ, మెయిన్ కచ్రా నహీ కరుంగా ధన్యవాద్ (హలో నేను అమితాబ్ బచ్చన్, నేను చెత్త వేయను. ధన్యవాదాలు)” అని వీడియోలో ప్రస్తావించారు.

READ MORE: US: అమెరికాలో ఏపీ విద్యార్థి గుండెపోటుతో మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు

అమితాబ్ బచ్చన్ పాత వీడియోపై పలువురు తారలు వ్యాఖ్యానించారు. ఆయనను ప్రశంసించడం కూడా కనిపించింది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో వీడియోను షేర్ చేశారు సూపర్ స్టార్. అందులో ఈ వీడియో చేయడానికి గల కారణం గతంలో మరాఠీలో చేసిన వీడియోలో ఓ పదాన్ని తప్పుగా ఉచ్చరించినట్లు ఆయన తెలిపారు. గురువారం పోస్ట్ చేసిన వీడియోలో సీనియర్ నటుడు ఇలా మాట్లాడారు. “హలో, నేను అమితాబ్ బచ్చన్. కొన్ని రోజుల క్రితం, నేను చెత్త వేయను అని పేర్కొంటూ సామాజిక అవగాహన పెంచడంపై వీడియోను పంచుకున్నాను. నేను మరాఠీ భాషలో కూడా అదే చెప్పాను. మరాఠీలో నా ఉచ్చారణ కొంచెం తప్పుగా ఉంది”. మరాఠీలో ‘కచ్రా’ అనే పదాన్ని తప్పుగా ఉచ్ఛరించాను. దాని గురించి నా స్నేహితుడు సుదేష్ భోసలే నాకు తెలియజేశారు. అందుకే, నేను ఈ వీడియోను ఈసారి సరైన ఉచ్ఛారణతో చేస్తున్నాను”. అని పేర్కొన్నారు.

READ MORE:Spirit: ‘స్పిరిట్‌’లో భార్య భర్తల విలనిజం? అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగా?

దీంతో పాటు మరాఠా వాసులకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత అందరూ అమితాబ్ బచ్చన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వినియోగదారు.. “అందరూ ఈ పదం యొక్క తప్పు ఉచ్చారణను అర్థం చేసుకోలేరు. అయితే విషయం తెలుసుకున్న ఆయన వెంటనే తన తప్పును అంగీకరించి సరిదిద్దుకున్నారు. అందుకే నువ్వు శతాబ్దపు మహానాయకుడివి” అని కామెంట్ చేశారు.