• కన్నడ సినిమా పరిశ్రమలో హనీట్రాప్ కేసు

  • గాంధీనగర్‌లో హనీట్రాప్ ముఠాపై ఎఫ్‌ఐఆర్

  • వీడియో చూపించి పోలీసులకు ఫిర్యాదు

కన్నడ సినిమా పరిశ్రమలో సినిమాల కంటే హత్యలు, దోపిడీలు, మోసాలు, అత్యాచారాలు, హనీట్రాప్ కేసులు బయట పడుతున్నాయి. నటుడు దర్శన్, నిర్మాత మునిరత్ ఇప్పటికే జైలుకు వెళ్లగా ఒక హనీట్రాప్ గ్యాంగ్ ఓ వ్యాపారవేత్తతో రూ.40 లక్షలకు సినిమా చేస్తామని చెప్పి నిండా ముంచింది. అసలు విషయం ఏమిటంటే కన్నడ సినిమా పరిశ్రమలో డబ్బులు తీసుకుని మోసం చేసి హనీట్రాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ ప్రముఖులు, నిర్మాతలు, సినీ పరిశ్రమ వరుస సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో మరో హనీ ట్రాపింగ్ ముఠా ఉదంతం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని గాంధీనగర్‌లో హనీట్రాప్ ముఠాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సినిమా తీస్తామని ఓ వ్యాపారి నుంచి డబ్బులు తీసుకుని హనీట్రాప్‌తో మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

Tollywood : గురువారం టాలీవుడ్ టాప్ -10 స్పెషల్ న్యూస్

వ్యాపారి గణేష్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గణేష్‌ -కావ్య, దిలీప్, రవికుమార్‌లపై ఫిర్యాదు చేశారు. వ్యాపారవేత్త గణేష్ కి బెంగళూరు ఎం.జి రోడ్డులో లైట్ ఆర్ట్ స్టూడియో ఉంది. సోషల్ మీడియాలో కావ్య అనే అమ్మాయి గణేష్ కి పరిచయం అయింది. నాలుగేళ్ల క్రితం ఆమె ఓ సినిమా చేస్తున్నట్టు నమ్మించి గణేష్ తో 4.25 లక్షలను డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌ పాటిల్‌కు బదిలీ చేయించింది. చాలా రోజులు గడిచాయి, సినిమా జాడే లేదు అని డబ్బు తిరిగి అడగడంతో కావ్య గణేష్‌ని గొట్టిగెరె అనే ప్రాంతానికి పిలిపించింది. ఈ సమయంలో, గణేష్ ఆమెను సెక్స్ చేయమని ప్రేరేపించేలా చేసి వీడియో షూట్ చేసి ఆ వీడియో చూపించి పోలీసులకు ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించింది.

ఆ తరువాత గణేష్ చేత ఒక డియో స్కూటర్ కొనిపించింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియో లీక్ చేస్తానని బెదిరించి బంగారు గొలుసు, బ్రాస్ లైట్ కూడా తీసుకుంది. ఇక వ్యాపారి గణేష్‌ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వ్యాపారి గణేష్ నుంచి దశలవారీగా రూ.40 లక్షలు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత మళ్లీ 20 లక్షలు విలువైన కారు ఇవ్వాలని కావ్య డిమాండ్ చేయడంతో వేధింపులు భరించలేక వ్యాపారి గణేష్, కావ్య, ఆమె స్నేహితులు దిలీప్, రవికుమార్ లపై హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు ఆధారంగా హనీట్రాప్ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.