• అదరగొట్టిన ఇళయదళపతి విజయ్ GOAT
  • ఓవర్సీస్ లో 15 మిలియన్ మార్క్ అందుకున్న GOAT
  • కేరళలో నిండా మునిగిన డిస్ట్రిబ్యూటర్స్

ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ యంగ్ గెటప్, లుక్స్ పట్ల ఫ్యాన్స్ కాస్త   నిరుత్సహానికి గురయ్యారు. భారీ  అంచనాల మధ్య రిలీజ్ అయిన GOAT ఆ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి.

Also Read : Devara : ఆంధ్ర – నైజాం ఏరియాల వారిగా దేవర డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్..

మరోవైపు ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 126.32 రాబట్టిన GOAT, 4రోజులకు గాను రూ. 288 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. వినాయక చవితి లాంగ్ వీకెండ్ రావడంతో కలెక్షన్స్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది GOAT.  కానీ తమిళనాడులో ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా 13 రోజులకి గాను రూ.  194.85 కోట్లు కలెక్ట్ చేసింది. తాజగా ఈ సినిమా 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ప్రకటించారు నిర్మాతలు. రిలీజ్ నాటి నుండి ఇప్పటి వరకు GOAT వరల్డ్ వైడ్ గా  రూ. 413 కోట్లు కొల్లగొట్టి విజయ్ సత్తా ఏ పాటిదో చూపింది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కవుగా కలెక్షన్స్ రాబడుతోంది. ఓన్లీ నార్త్ అమెరికాలోనే 13 రోజులకు గాను రూ. 35.25 కోట్లు రాబట్టింది, ఓవర్సీస్ మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు అటుఇటుగా $16.02M ( 150కోట్లు) కొల్లగొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు కేవలం రూ. 12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ ముగించింది.