ఫిబ్రవరి 27, 2002.. ప్రాంతం గోద్రా రైల్వేస్టేషన్‌.. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని S6 కోచ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ కోచ్‌లో ఉన్నవారంతా కరసేవకులు.. అయోధ్య నుంచి తిరిగి వస్తున్నారు. ఈ ఘటనలో 59మంది అగ్నికి ఆహూతయ్యారు. ఇది గుజరాత్‌లో నాడు మత అల్లర్లకు దారి తీసింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ తగలబెట్టింది ముస్లింలనే అనుమానంతో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిరసనలు భగ్గుమన్నాయి. వందలాది ముస్లింలను అతివాదులు చంపేశారు.. నాడు గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నారు. దీంతో ఈ ఘటనల వెనుక మోదీ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కేసుల నుంచి మోదీ క్లీన్‌చిట్‌గా ఎలా బయటపడ్డారు? అప్పటినుంచి 2024 వరకు గుజరాత్‌లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎలా జాగ్రత్తపడ్డారు?

Also Read: మళ్లీ సెప్టెంబర్‌ 17 వివాదం.. పోటాపోటీగా వేడుకలు

2002లో గుజరాత్‌లోని 16 జిల్లాల్లో ముస్లింల ఇళ్లు, వ్యాపార సంస్థలు, ఇతర ఆస్తులపై దాడులు జరిగాయి.వందలాది మంది బాలికలు, మహిళలను వారి ఇళ్ల నుంచి బయటకు లాగారు. వారి కుటుంబాల ముందు వివస్త్రను చేశారు. ఆ తర్వాత వారిపై అత్యాచారం చేశారు. బాధితులైన మహిళలు నేడు దివ్యాంగులగా మనకు గుజరాత్‌లో కనిపిస్తుంటారు.. మరికొందరిని కాల్చి చంపారు. బాధితుల్లో యువతులుచ వృద్ధులు, గర్భిణీలు, శిశువులు ఉన్నారు. ఈ అల్లర్లకు ప్రభుత్వమే కారణమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టించింది. దీంతో నాటి సీఎంగా ఉన్న మోదీ గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నారు. గుజరాత్ అల్లర్లు, వాటి అనంతర పరిణామాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఈ అల్లర్ల తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ మోదీ ఘన విజయం సాధించారు. మరోసారి గుజరాత్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అటు ఆయనపై పడిన కేసులను కోర్టు కొట్టివేస్తూ వచ్చాయి. ప్రతీ కోర్టులోనూ ఈ అల్లర్ల వెనుక మోదీ ప్రమేయం లేదని క్లీన్‌చిట్‌లు వచ్చాయి. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోదీతో పాటు అధికారులు, రాజకీయ నాయకులతో సహా మరో 63 మందిపై కాంగ్రెస్ నేత ఎహ్సాన్ భార్య జకియా చేసిన అప్పీల్‌ను జూన్ 2022లో సుప్రీంకోర్టు కొట్టివేసింది.

సెప్టెంబరు17, 1950లో ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లా-వాద్‌నగర్ అనే చిన్న పట్టణంలో పుట్టారు మోదీ. యుక్త వయసులో ABVPలో చేరిన మోదీ గుజరాత్‌లోని వివిధ సామాజిక-రాజకీయ ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించారు. 1987లో BJPలో చేరారు. 1995లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీ ఎంతగానో కృషి చేశారు. ఆయన కష్టాన్ని గుర్తించిన పార్టీ పెద్దలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించింది. అక్కడ కూడా మోదీ సక్సెస్ అయ్యారు.. ఇక ఆ తర్వాత 2001లో గుజరాత్‌లో భూకంపం రావడం.. సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమవడం.. మోదీని స్వయంగా అద్వానీ సీఎంగా నిలబెట్టి గెలిపించడం చకాచకా జరిగిపోయాయి.

Also Read: ఢిల్లీ నెక్స్ట్‌ సీఎం ఎవరో తెలుసా ? రేసులో ఉంది వీళ్లే

ఇక 2002 అల్లర్లతో అప్పటికే అప్రతిష్ట మూటగట్టుకున్న గుజరాత్‌ను అభివృద్ధివైపు మోదీ నడిపించారని చెబుతారు విశ్లేషకులు. అలా ‘గుజరాత్‌ మోడల్‌’ అనే పదాన్ని మోదీ ప్రమోట్ చేసుకున్నారు.. ఇదే 2014లో మోదీని పీఎం అభ్యర్థిగా నిలబెట్టడంతో పాటు గెలిపించడంలో కీ రోల్ ప్లే చేసింది. ఇక 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, జీఎస్టీ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు బీజేపీ చిరకాల స్వప్నం రామమందిరం నిర్మాణం కూడా మోదీ ప్రధానిగా ఉండగానే ప్రారంభోత్సవం జరిగింది. దీంతో ఆయనకు క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. అటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లాంటి పథకాలతో పెద, మద్యతరగతి ప్రజలకు దగ్గరయ్యారు మోదీ.. ఇదే ఆయన్ను మూడోసారి కూడా ప్రధాని అవ్వడానికి కారణమైంది. ఇక సెప్టెంబర్ 17న 74వ బర్త్‌ డే జరుపుకుంటున్న మోదీకి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు విషెస్‌ చెబుతున్నారు.