Nagababu: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సదరు మహిళ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తనపై కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు.

ఇకపోతే పోలీసుల గాలింపు చర్యలలో భాగంగా ఎట్టకేలకు ఈయన పోలీసులకు దొరికిపోయారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ అరెస్ట్ కావడంతో ప్రముఖ నటుడు నిర్మాత నాగబాబు జానీ మాస్టర్ అరెస్టు గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా ఈయన స్పందిస్తూ చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్తుడిగా పరిగణించవద్దు అంటూ ఉన్నటువంటి ఒక కొటేషన్ షేర్ చేశారు. మీరు వినేది నమ్మద్దని ప్రతి కథకు మూడు వైపులు ఉంటాయంటూ మరో పోస్ట్ చేశారు దీంతో నాగబాబు చేసిన ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అసలు ఈయన ఎవరిని ఉద్దేశించి చేశారు జానీ మాస్టర్ గురించి అయితే మరో కథ ఏంటి అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.

జానీ మాస్టర్ కు మద్దతు..
ఈ విధంగా జానీ మాస్టర్ అరెస్టు గురించి నాగబాబు పరోక్షంగా స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ పట్ల నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇక జానీ మాస్టర్ మెగా కుటుంబానికి చాలా సన్నిహితుడు అనే విషయం మనకు తెలిసిందే .దీంతో నాగబాబు ఇలా పరోక్షంగా జానీ మాస్టర్ కు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో పలువురు ఈయనపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

https://x.com/NagaBabuOffl/status/1836649983040184806?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1836649983040184806%7Ctwgr%5Eae40f83b3b281061cc3fbffb05412ce009982bd6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fnagababu-indirect-tweet-on-jani-master-tweet-goes-viral-866966.html