• కలోంజి గింజల నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది

  • కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి.

కలోంజి గింజలు (నల్ల జీలకర్ర) అందరి ఇళ్లలో వంటగదిలో ఉంటాయి. ఇవి ఆహార రుచిని రెట్టింపు చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కలోంజి గింజల నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోవడంతో పాటు వ్యాధులు కూడా దూరమవుతాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని సైతం ఈ గింజలు పెంపొందిస్తాయి. కలోంజి గింజలు వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.

Good News: సింగరేణి కార్మికులకు సీఎం శుభవార్త.. దసరాకు రూ.లక్షా 90 వేల బోనస్

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది దివ్యౌషధం:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కలోంజి గింజల నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలోంజి గింజల నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. మద్యపానంతో పాటు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడే వారు రాత్రిపూట నీటిలో రెండు చెంచాల కలోంజి గింజలను నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

గుండెకు మంచిది:
కలోంజి గింజల నీరు గుండెకు చాలా మంచిది. ఇందులో తగినంత పొటాషియం ఉంటుంది. ఇది గుండె బలానికి చాలా ముఖ్యమైనది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కలోంజి గింజల వాటర్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను చాలా వరకు నివారించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంతో పాటు మెరిసే చర్మానికి ప్రభావవంతం:
బరువు పెరగడం అనే సమస్య ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైపోయింది. పెరిగిన బరువును కలోంజి గింజల వాటర్‌తో తగ్గించుకోవచ్చు. ఇందులో.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కలోంజి గింజల నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాకుండా.. జీవక్రియను పెంచడంలో చాలా సహాయపడుతుంది. మంచి ఆహారం, తేలికపాటి వ్యాయామంతో పాటు కలోంజి గింజల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. అలాగే.. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కలోంజి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.

కడుపు సంబంధిత వ్యాధులకు ఉపయోగించండి:
కడుపు సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కలోంజి గింజల నీరు చాలా సహాయపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం లేదా అసిడిటీ సమస్య ఉంటే.. కలోంజి గింజల నీరు చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇది అన్ని కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.