• జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి

  • జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్

  • 2019లోని బాధితురాలతో జానీ మాస్టర్కు పరిచయం

Jani Master Remand Report Exclusive: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను జానీ మాస్టర్ రేప్ చేశాడు, అంటూ ఆయన వద్ద పనిచేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా హైదరాబాద్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక తాజాగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే బాధితురాలిని జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేర్చుకున్నారని, 2019లోని బాధితురాలతో జానీ మాస్టర్కు పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు.

Akhil Akkineni: హిట్ కొట్టాకే ఫాన్స్ ముందుకు అయ్యగారు!

2020వ సంవత్సరంలో జానీ మాస్టర్ బాధితురాలి మీద లైంగిక దాడి చేశాడని తొలిసారి జానీ మాస్టర్ బాధితురాలు మీద లైంగిక దాడి చేసినప్పుడు ఆమె వయసు పదహారేళ్ళని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న దాని ప్రకారం నాలుగేళ్లలో బాధితురాలిపై ఎన్నోసార్లు లైంగిక దాడి జరిగినట్లుగా ఉంది. ఈ విషయం బయటికి చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని కూడా జానీ మాస్టర్ బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జానీ మాస్టర్ తో పాటు జానీ మాస్టర్ భార్య కూడా ఈ మేరకు బెదిరింపులకు దిగినట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించడం జరిగింది. ఇక ఈ రిమాండ్ రిపోర్టు ప్రకారం చూస్తే జానీ మాస్టర్ కు కఠిన శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తోంది. మొదటిసారి లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలు వయసు 16 సంవత్సరాలు కావడంతో పోస్కో చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చట్టం కింద కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ విశ్లేషకులు చెబుతున్నారు.