• సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున దేవర రిలీజ్
  • టికెట్ ధరలు పెంచుకునేందుకు దరఖాస్తు చేసిన నిర్మాతలు
  • ప్రత్యేక అనుమతులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవరను అటు ఏపీ ఇటు తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ  ఇరు ప్రభుత్వాలకు దరఖాస్తు చేసారు నిర్మాతలు.

Also Read : David Warner : పుష్ప – 2లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్..?

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఏపీలోని అన్ని సినిమా హాళ్లల్లో బాల్కనీ టికెట్ ధరలు రూ.110కి, దిగువ క్లాస్ టికెట్ ధరలు రూ.60 మేర పెంచుకుందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు అనగా అక్టోబరు 5వరకు ప్రతిరోజు 5 స్పెషల్ షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే కేవలం 27 తేదీన ఒక్క రోజు మాత్రమే 6 షోలు ప్రదర్శించుకునేలా ఉత్త్వరులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా  టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మొదటి రోజు 6 షోస్ కు అనుమతులు రావడంతో డే – 1 కలెక్షన్స్  ఊహించిన దాని కంటే ఎక్కువ కనిపించేలా ఉంటుందని ట్రేడ్ అంచనా.