• గిన్నీస్ బుక్ లోకి మెగాస్టార్ చిరంజీవి పేరు

  • అత్యధిక చిత్రాల్లో అత్యధిక పాటలకి అత్యధిక డ్యాన్స్ మూవ్స్ చేసినందుకు రికార్డు

  • ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హైదరాబాదులో ఈవెంట్

Megastar Chiranjeevi: ఇప్పటికే సినిమాలు చేస్తూ కొన్నాళ్లపాటు రాజకీయాలు చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోబోతున్నారు. ఎక్కువ సినిమాల్లో డాన్స్ చేసి నటించినందుకుగాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ గా ఘనత దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాదులోని ఐటిసి కోహినూర్ లో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిమ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ లో నమోదు చేయనున్నారు.

Also Read: Devara Pre-Release Business : ఎన్టీఆర్ సరికొత్త రికార్డు

ఇక మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే 155 సినిమాలు చేశారు. ఆయన వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది మెగాస్టార్ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో రెండో అవార్డును దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆయనకు ఈ అరుదైన ఘనత దక్కడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 156 సినిమాల్లో 537 సాంగ్స్ కి గాను 24 వేల డాన్స్ మూవ్స్ కు గాను ఈ గిన్నీస్ రికార్డు అనౌన్స్ చేశారు. ఇక ఈ మేరకు ఒక గిన్నిస్ రికార్డు ఇప్పటికే బ్రహ్మానందం పేరు మీద ఉంది. ఆయన 759 సినిమాలలో నటించినందుకుగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఆ జాబితా 1000 సినిమాలకు చేరింది.