Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి దీక్ష తీసుకున్నారు. ఈయన 11 రోజులపాటు ఈ ప్రాయశ్చిత్త దీక్షలో ఉండబోతున్నారని తెలుస్తుంది. నేడు ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అర్చకుల సమక్షంలో ఈయన దీక్ష తీసుకున్నారు.

ఆలయ అర్చకులు ఈయన చేతికి దీక్షా కంకణం కట్టి దీక్షను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఈ దీక్షను 11 రోజులపాటు చేయబోతున్నారని తెలుస్తుంది. ఇలా 11 రోజుల తర్వాత ఈ దీక్షను విరమించబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకోవడానికి గల కారణం తిరుపతి లడ్డు అపవిత్రం కావడమేనని తెలుస్తోంది.

గత ప్రభుత్వం తిరుపతి లడ్డు తయారీలో ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు నుంచే ఉపయోగించిన నూనేను కలిపి ప్రసాదంగా తయారు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడుతూ వైకాపా నేతలపై వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారాహి అమ్మవారి దీక్ష..
ఇలా నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనె ఉపయోగించడంతో తిరుమల లడ్డు అపవిత్రం అయిందని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చితం దీక్ష కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. 11 రోజులపాటు ఈ దీక్ష పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా దీక్ష తీసుకోవడం సర్వసాధారణం. ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం మరోసారి దీక్ష కొనసాగిస్తున్నారు.