• సెప్టెంబరు 27న దేవర గ్రాండ్ ప్రీమియర్స్
  • ఓవర్సీస్ లో దూసుకెళ్తున్న దేవర
  • బ్రేక్ ఈవెన్ సాదించేందుకు దేవర దూకుడు

RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా , బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ  బడ్జెట్ పై  సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్ భారీ  స్థాయిలో జరిగింది.

Also Read : Jani Mastar case : కొన్ని ఛానెల్స్ అత్యుత్సాహంతో బన్నీపేరు పెట్టాయి: పుష్ప నిర్మాత

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. కాగా ఇటీవల దేవర ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అడ్వాన్స్ సేల్స్ అదరగోట్టాయి. మరి ముఖ్యంగా నార్త్ అమెరికా సేల్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. నార్త్ అమెరికా రైట్స్ ను ఇండియన్ రూపీస్ ప్రకారం 26 కోట్లకు అమ్ముడవగా అడ్వాన్స్ సేల్స్ రూపంలో ఇప్పటి వరకు రూ. 21 కోట్లు రాబట్టింది. విడుదలకు ఇంకా 4 రోజులు ఉండడంతో ఆ రోజు నాటికీ బ్రేక్ ఈవెన్ సాధించి విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా దేవర సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. రైట్స్ కొనుగోలు చేసిన బయ్యర్ కు లాభాల పంట పండినట్టే.  టికెట్స్ పరంగాను దేవర దూకుడు కనిపిస్తోంది. ఇప్పటివరకు 60k టికెట్స్ బుక్ అయి రికార్డు సృష్టించింది దేవర.