Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించాలని ఎంతో ఘనంగా అన్ని ఏర్పాట్లు చేశారు అయితే చివరి క్షణంలో ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఒక్క సారిగా ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ వేడుక రద్దు కావడంతో ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా అందరికీ ముందుగా క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ వేడుక రద్దు కావడంతో తాను ఎంతో ఆవేదన చెందుతున్నానని వెల్లడించారు.

అందరికీ తెలుసు అవకాశం, దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని దేవర మూవీ గురించి దేవర మూవీ కోసం మేం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇలా జరగడం వెనుక దేవర నిర్మాతలలో లేక ఈవెంట్ ఆర్గనైజర్స్ ను నిందించడం కూడా కరెక్ట్ కాదు, అని నా ఫీలింగ్. ముందుగా మీరు కురిపించే ఈ ప్రేమకు ఆజన్మాంతం రుణపడిపోయి ఉంటాను.

జాగ్రత్తగా వెళ్ళండి..
ఇప్పుడు మనం ఈ వేడుక ద్వారా కలవకపోయినా సెప్టెంబర్ 27వ తేదీ తప్పకుండా కలుస్తామని మీరందరూ అనుకున్నట్టే దేవర సినిమా మీ అందరిని మంచిగా ఎంటర్టైన్ చేస్తుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా థియేటర్ కి వచ్చి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అలాగే మీ ఆశీర్వాదాలు మాపై పెట్టండి మరోసారి అందరికీ చెబుతున్నాను మీరు ఇంత క్షేమంగా ఇంటికి వెళ్తారనే కోరుకుంటున్నాను అంటూ అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.