• సెప్టెంబర్ 27 న దేవర గ్రాండ్ రిలీజ్
  • అమెరికా వెళ్లిన యంగ్ టైగర్
  • మీడియాతో ముచ్చటించిన దర్శకుడు కొరటాల

యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా  దర్శకుడు కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కొరటాల సమాధానం ఇచ్చారు. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ లోని ముఖ్యమైనవి పాఠకుల కోసం

Q : దేవర కథ ముందు  అల్లు అర్జున్  తో అనుకున్నారా..? 

Siva : అల్లు అర్జున్ తో చెయ్యాలనుకున్న కథ వేరు.. దేవర కథ వేరు

Q : ఆచార్య ప్లాప్ మీపై ఒత్తిడి పెంచిందా..?

Siva : ఆచార్య ప్రెషర్ ఏమీ లేదు, ఆచార్య రిలీజైన మూడవ రోజు నుండే దేవర మోషన్ పోస్టర్ వర్క్ లో పడిపోయా,కాకపోతే మరింత బాధ్యత గా పని చేశా

Q : చిరంజీవిగారితో మీ బాండింగ్ ఎలా ఉంది..?

Siva : చిరంజీవి గారితో నా అనుబంధం ఎప్పడూ బానే ఉంటుంది. ఆచార్య రిలీజ్ తర్వాత “you will bounce back stronger shiva” అని నాకు మెసేజ్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే.

Q : ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం గురించి..?

Siva : ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం మాకు బిగ్ డిస్సపాయింట్.. అందరికీ సినిమా గురించి మాట్లాడుకోవడానికి సరైన ఒకే ఒక్క వేదిక. అందరూ చాలా ప్రీపేర్ అయ్యారు. కానీ ఊహించని విధంగా ఇలా జరిగింది. –

Q : దేవర రెండు భాగాలుగా చేయాలని ముందే అనుకున్నారా..?

Siva : దేవర ముందు రెండు పార్ట్స్ వద్దనుకున్నాం, అందరూ చేస్తున్నారని మనం చేసినట్టుంటుందని… కానీ మాకు కంటెంట్ చెప్పడానికి ఒక పార్ట్ సరిపోదనిపించింది. సెకండ్ షెడ్యూల్ లోనే పార్ట్ -2 అనుకున్నాం.

Q : ట్రైలర్ చూస్తే తారక్ గత సినిమాలు గుర్తొస్తున్నాయి అనే కామెంట్ మీ వరకూ వచ్చిందా?

Siva : ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటే కంపేర్ చేస్తే ఎలా? అలా అంటే భూమి పుట్టినప్పటి నుండి ఈ తరహా కథలున్నాయిగా .

Q :  రాజమౌళి Pan-India ప్రమోషన్స్ చేస్తారు. దేవరకు మీరు  ప్రెస్ మీట్ తో సరిపెట్టేసారు..? 

Siva : మార్కెటింగ్ విషయంలో నేను చాలా వీక్. రాజమౌళి లాగా మార్కెటింగ్ చేయడం నాకు రాదు. ఇది పెద్ద సినిమా అని నాకు తెలుసు కానీ ప్రమోషన్లు, సినిమా పబ్లిసిటీ అనేది నేను నా నిర్మాతలకే వదిలేస్తాను. అంతే తప్ప ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను.

Q : ట్విట్టర్ లో ఎందుకని లేరు..? 

Siva : సోషల్ మీడియాలో ఫన్ కంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. అందుకే దూరంగా ఉంటున్నాను. ఇతరుల పై నెగిటివిటీ మరీ ఎక్కువైపోయింది. అందుకే నేను ట్విట్టర్లో లేను.   మొన్న నేను ఇంటర్వ్యూలో “ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి” అన్న మాటను కూడా వేరే విధంగా తీసుకుని వేరే వాళ్ళకి ఆపాదించారు.

Q :  సోషల్ మీడియాకు కొరటాల శివ సందేశం

అందమైన ప్లాట్‌ఫారమ్ అది. ఆనందించండి.  మీమ్స్ చేసుకోండి కానీ నెగిటివ్ కామెంట్స్ వద్దు,  Live and Let Live, ఇదే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరి హీరోలతో సినిమాలు చెయ్యాలి. అందరూ బ్రతకాలి” అని అన్నారు.