• సరికొత్త చరిత్ర సృష్టించిన దేవర
  • ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక్క రోజే 46 షోలు
  • భారీ ధర పలుకుతున్న 1am షో టికెట్స్

రెండు తెలుగు రాష్టాల్లో ఎక్కడ చుసిన దేవర మ్యానియా కనిపిస్తోంది. టికెట్స్ కోసం రికమెండేషన్స్, బెన్ ఫిట్ షోస్ ఏర్పాట్లు ఎన్నడూ లేని విధంగా ఓవర్సీస్ తెలుగు స్టేట్స్ ఒకేసారి షోస్, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవర పైనే డిస్కషన్స్. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానున్న దేవర భారీ ఎత్తున ప్రీమియర్స్ వేస్తున్నారు ఆంధ్ర ఏరియాలో. కృష్ణ గుంటూరు, సీడెడ్ లో అయితే ఈ వేడి కాస్త ఎక్కువగా ఉంది.

Also Read : OTT : విజయ్ G.O.A.T ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ..?

కాగా హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్ లో ప్రతి స్టార్ హీరోకు అడ్డాగా భావించే థియేటర్స్. అక్కడ రికార్డు కొడితే ఫ్యాన్స్ కు వచ్చే కిక్ వేరు. ఇప్పటివరకు క్రాస్ రోడ్ లో డెయ్ -1 హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా కల్కి 87 లక్షల రూపాయలు సాధించిన సినిమాగా వుంది, రెండవ స్తానం లో గుంటూరు కారం – రూ . 82లక్షలు RRR – రూ. 75.87 గా ఉన్నాయి. కాగా ఇప్పుడు దేవర కు చూస్తున్నట్రెండ్స్ చూస్తే ఆ మూడు చిత్రాల రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. దేవరను ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని అన్ని థియేటర్లలో 7 షోస్ ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించి బుకింగ్స్ స్టార్ట్ చేయగా నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్ అయ్యాయి. మొత్తం 7 థియేటర్లు 46 షోస్ దేవరను ప్రదర్శించనున్నారు. ఈ షోస్  గ్రాస్ అటు ఇటుగా   1.25 కోట్లు గా ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్ కలెక్షన్స్ డే – 1 సాధించడం అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే మొదటి సారి