చపాతీలు తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అయితే టేస్టీగా, మెత్తగా ఉండాలని కొందరు చపాతీలను నేరుగా గ్యాస్ మంట మీద కాలుస్తారు. ఇలా కాల్చిన చపాతీలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ నుంచి విడుదలయ్యే హానికర రసాయనాలు క్యాన్సర్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. వంటగ్యాస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటివి విడుదల కావడంతో శ్వాసక్రియ, జీర్ణక్రియ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

బొగ్గుల మీద కాల్చడం బెటర్

డైరెక్ట్‌గా గ్యాస్ మంట మీద వండితే.. ఆహారం పైరోలిసిస్‌కు కారణం అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని నుంచి విడుదలైన రసాయనాల వల్ల గుండె, శ్వాసకోశ ప్రమాదాలు అధికం అవుతాయి. చపాతీలు తొందరగా కావడంతో పాటు గ్యాస్ ఆదా అవుతుందని ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలను కోరితెచ్చుకున్నట్లే. ఇలా గ్యాస్ మీద కాకుండా బొగ్గులపై చపాతీలు కాల్చడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.