• హర్ష సాయి కేసులో కీలక మలుపు
  • ప్రస్తుతం పరారీలో ఉన్న హర్ష సాయి
  • నమ్మించి మోసం చేశాడన్న బదితురాలి తరపు లాయర్

హర్ష సాయి కేసులో అసలేం జరిగింది అనే దానిపై  హర్ష సాయి బాధితురాలి లాయర్ నాగూర్ బాబు Ntv తో మాట్లాతూ వాస్తవాలు బయటపెట్టారు.  బాధితురాలు హర్ష సాయి  హీరోగా నిర్మిస్తున్న ‘మెగా’  సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. 2022 లో ఒక సాంగ్ కోసం బాధితురాలు  తొలిసారి హర్ష సాయిని కలిశారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది. తన వద్ద ఒక స్టోరీ ఉంది అని హర్ష బాధితురాలికి చెప్పాడు. తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మబలికాడు. అలా బాధితురాలు మెగా అనే మూవీ స్టార్ట్ చేసింది. ఆమె సొంత డబ్బులతో  మెగా సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

తనకు హైదరాబాదులో ఉండడానికి షల్టర్ లేదని, చెప్పడంతో బాధితురాలు హర్ష సాయి కోసం ఒక విల్లాను అరేంజ్  చేసి ఇచ్చింది.  స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాలి అని బాధితురాలిని హర్ష సాయి కోరగ, అతని మాటలు నమ్మి బాధితురాలు హర్ష సాయి ఉండే విల్లాకు వెళ్ళినప్పుడు ఆమెకు మత్తు మందు ఇచ్చి, ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెపై లైంగీకదాడికి పాల్పడ్డాడు, అంతేకాకుండా ఆ తతంగాన్ని వీడియో రికార్డ్  చేసి, మరుసటి రోజు ఆమెకు ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడు. ఇలాంటివి చేయడం నాకు ఫాంటసీ, ఇలాంటివి నా వద్ద చాలా ఉన్నాయని చెప్పాడు.

తాను లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు హర్ష వాళ్ళ నాన్న రాధాకృష్ణ ఎంటరయ్యాడు. మీడియాకు వెళ్తే ఇద్దరి ఫేం నాశనం అవుతాయని సర్ది చెప్పాడు. తర్వాత  హర్షసాయి  నాన్న మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు, దీంతో బాధితురాలు నమ్మింది, దీంతో కేస్ ఫైల్ చేయకుండా గతంలో విత్‌ డ్రా చేసుకుంది, 2023లో మెగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయింది. ట్రైలర్ సక్సెస్ కావడంతో హర్ష సాయికి దురాశ పుట్టింది. ఆమెతో ఉన్న సినిమా కాపీరైట్స్ దక్కించుకోవడానికి వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.

టీజర్ రిలీజ్ కి ముందే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అప్పటినుండి బాధితురాలు పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తుంది. ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ఎడిట్ చేసి హర్షకు అనుకూలంగా మార్చుకొని అవి చూపించి ఆమెను బెదిరించాడు. బాధితురాలిని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేస్తూ, సినిమా కాపీ రైట్స్ ఇస్తేనే తాను మిగతా షూటింగ్ లో పాల్గొంటానని,  లేకపోతే వీడియోలను రిలీజ్ చేస్తానని బెదిరించాడు. హర్ష సాయి పెట్టె వేధింపులు  తట్టుకోలేక చివరకు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆడియో, వీడియో ఎవిడెన్స్ లు కోర్టుకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కోర్టులో హర్షసాయికి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న నమ్మకం ఉంది” అని తెలిపారు.