టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 6 ఏళ్ళ తర్వాత తారక్ సినిమా సోలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న రానున్న ఈ  సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అటు టాలీవుడ్ ట్రేడ్ కూడా దేవర రిసల్ట్ పై ఆసక్తిగా గమనిస్తోంది.

Also Read : Game Changer : “రా మచ్ఛా మచ్చా” ఎప్పడు వచ్చేది మాత్రం చెప్పరు..

కాగా దేవర సినిమాకు తెలంగాణ ప్రభుత్వం అధిక ధరకు టికెట్స్ అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా రిలీజ్ టైం లో డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించడానికి స్టార్ హీరోస్ ముందుకు రావాలని అందుకు తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తూ వీడియో చేసి సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లలో ప్రదర్శించేలా నియమం పెట్టారు. ఆ నియమాన్ని పాటిస్తూ, దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తారక్ డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read : Mohan Babu : మంచు పెదరాయుడు ఇంట్లో భారీ చోరీ..

ఈ వీడియో లో ‘ మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడడం కోసం, సహచరుల ప్రభావంతో, కొందరు స్టైల్ అనుకొని మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు అవ్వడం చాలా బాధాకరమైన విషయం. జీవితం చాలా విలువైనది. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అందరూ సహకరించాలి,  మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లు అయితే వెంటనే తెలంగాణ అంటి నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయండి’ అని తారక్ చెప్పారు. ఎవరు   డ్రగ్స్ బారిన పడొద్దని అభ్యర్ధించారు.