Kidney: ఊబకాయం, కొవ్వు అనేక వ్యాధులకు కారణం. బాడీ మాస్ ఇండెక్స్ అధిక బరువు లేదా ఊబకాయాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఊబకాయం ఉంటే మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 40 శాతం మహిళలు, 12 శాతం పురుషులు ఉదర ఊబకాయంతో బాధపడుతున్నారు. పొత్తికడుపు వంటి పైభాగంలో కొవ్వు పేరుకుపోవడం జీవక్రియ వ్యాధి, పేలవమైన ఆరోగ్యానికి సంకేతం అంటున్నారు.

కిడ్నీ సమస్యలు వస్తాయా..?

  • ఊబకాయం వల్ల కిడ్నీ సమస్యలు కూడా వస్తాయని కిడ్నీ డిసీజ్ ఇంప్రూవింగ్ గ్లోబల్ అవుట్‌కమ్స్ చెబుతోంది. వివిధ అధ్యయనాలను బట్టి మనదేశంలో కిడ్నీ వ్యాధి ప్రాబల్యం 3 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం 100,000 కొత్త రోగులకు డయాలసిస్‌, మూత్రపిండ మార్పిడి అవసరమవుతుందని అంటున్నారు.

ఊబకాయం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

  • పెరిగిన విసెరల్ కొవ్వుతో ఊబకాయం మన శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఇది మధుమేహం, అధిక BP, కరోనరీ వాస్కులర్ వ్యాధి, స్ట్రోక్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో పాటు ఇతర వ్యాధులకు దారితీస్తుందని చెబుతున్నారు. ఇది శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. శరీర కొవ్వు కూడా డైనమిక్ ఎండోక్రైన్ అవయవంగా పరిగణించబడుతుంది. ఇది లెప్టిన్, అడిపోనెక్టిన్ వంటి వివిధ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుందని, ఫలితంగా ఊబకాయం ఏర్పడుతుందని అంటున్నారు. ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని, అధిక రక్తపోటు, మధుమేహానికి దారితీస్తుందని, ఇది మూత్రపిండాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.