Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా విడుదలకు మరొక రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు.

తెలంగాణలో సినిమాకు అదనపు షోలు రావాలన్నా లేదంటే టికెట్ల రేట్లు పెంచాలన్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కండిషన్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ఆ సినిమాలో నటించిన నటీనటులు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఒక వీడియోని చేస్తూ అందరిలో చైతన్యం కలిగేలా చేయాలంటూ కండిషన్ పెట్టారు.

ఇక దేవర సినిమాకి తెలంగాణలో ఆదరణ పశువులు పెంచడం అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచడంతో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఒక వీడియోను విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూమన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ అనో మాదక ద్రవ్యాల బారిన పడటం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే చాలా విలువైనది. రండి, నాతో చేతులు కలపండి.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం..

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ వినియోగించటం కానీ చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 8712671111 కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.