చర్మ సౌందర్యం కోసం కొందరు కొన్ని ఉత్పత్తులను వాడుతుంటారు. అందరిలో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో సౌందర్య ఉత్పత్తులను వాడుతారు. అందరూ ఎక్కువగా వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో రోజ్ వాటర్ ఒకటి. రోజూ దీనిని చర్మానికి అప్లై చేయడం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రాత్రి నిద్రపోయే ముందు చర్మానికి రోజ్‌వాటర్‌ను అప్లై చేస్తే.. తేమ పోయి స్కిన్‌ మెరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి రక్షణగా ఉంటుంది. అలాగే చర్మం కూడా మృదువుగా తయార కావడంతో పాటు ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తుంది. శనగ, బియ్యం పిండి, పసుపు ప్యాక్‌లో రోజ్ వాటర్ కలిపి స్కిన్‌కి ప్యాక్ వేసుకుని.. పదినిమిషాల తర్వాత రిమూవ్ చేయండి. ఇన్‌స్టంట్‌గా ముఖం కాంతిమంతంగా మారిపోతుంది. మీరు స్కిన్‌కి ఉపయోగించే ప్రతి ప్యాక్‌కి రోజ్ వాటర్ కలపడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. బయటకు వెళ్లేముందు చర్మానికి రోజ్ వాటర్ రాస్తే ఎండ నుంచి స్కిన్‌కి రక్షణ కలుగుతుంది. 

ఇంట్లోనే తయారు చేసేద్దాం

మార్కెట్లో దొరికే రోజ్‌వాటర్‌లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని వాడటం చర్మానికి అంత మంచిది కాదు. సొంతంగా ఇంట్లోనే రోజ్ వాటర్‌ను తయారు చేసుకోవచ్చు. తాజా గులాబీ ఆకులను తీసుకుని గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టుకుని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ గులాబీ వాటర్‌ను చర్మానికి అప్లై చేస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది.