ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో గేమ్ చేంజెర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్గా నిర్వహిస్తున్నారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి వచ్చిన కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్ అనుకరిస్తూ చేసిన కొన్ని పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా జగన్ మైకు పట్టుకుని తన చేతితో మైక్ ను తడుతూ ఉంటారు. అదేవిధంగా పృద్వి కూడా జగన్ చేసినట్లుగానే ఆయనను అనుకరిస్తూ అందరికీ అభివాదం చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ జై జనసేన అంటూ మొదలుపెట్టి రాజమహేంద్రవరం, ఈ రోజు ఇక్కడికి రావడం ఒక గొప్ప అదృష్టం. ఎన్ని సినిమాలైనా చేయొచ్చు ఎన్ని పాత్రలైనా చేయొచ్చు కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతికి ఇంకా నాలుగు ఐదు రోజులు ముందే ఉంది, కానీ మనం ముందే వచ్చేస్తున్నాం. ఈరోజు సంక్రాంతి అన్నట్టుగా అనిపిస్తోంది.
Game Changer: ఏపీలో గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెరిగాయ్.. ఎంతో తెలుసా?
ఈరోజు దేవుడు అదే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజు, గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్, ఇది దేవుడు స్క్రిప్ట్ అంటే అంటూ వైఎస్ జగన్ డైలాగ్స్ మరోసారి అనుకరించారు. మొన్ననే ఒక సినిమాలో చెప్పాను నాకు చేత ఒక అపోజిషన్ వ్యక్తి క్యారెక్టర్ చేయించారు.. అసలే పవర్ లో లేను 11 వచ్చేశాయి ఏం చేయాలి? అంటూ వైసీపీ అసెంబ్లీ సీట్లను ఉద్దేశిస్తూ కూడా ఆయన డైలాగ్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు వేస్తున్నాం కడుగుతున్నాం, ఎండ వేస్తున్నాం అంటూ వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. ఇక ఆ తర్వాత తమ దేవుడు పవన్ కళ్యాణ్ వచ్చేముందు సినిమా గురించి మాట్లాడుతానంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో పృద్వి ఎస్జే సూర్య అసిస్టెంట్ పాత్రలో కనిపించారు. ఆయనది ఫుల్ లెన్త్ రోల్ అని చెబుతున్నారు.