ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైన “35 చిన్న కథ కాదు” | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 25, 2024 2:07 PM IST

ఈ ఏడాది మన తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు బ్యూటిఫుల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్ నివేత థామస్ అలాగే యువ నటుడు విశ్వదేవ్ రాచకొండ కాంబినేషన్ లో దర్శకుడు నంద కిషోర్ ఈమని తెరకెక్కించిన సినిమా “35 చిన్న కథ కాదు” కూడా ఒకటి. మరి థియేటర్స్ సహా ఓటిటిలో కూడా సూపర్ హిట్ అయ్యిన ఈ సినిమా లేటెస్ట్ గా ఓ ప్రముఖ అవార్డ్స్ వేడుకలకి ఎంపిక కావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది గోవాలో జరగనున్న ప్రముఖ ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లోకి తెలుగు సినిమా సైడ్ నుంచి 35 చిన్న కథ కాదు కూడా అఫీషియల్ గా ఎంపిక కావడం జరిగింది. దీనితో హీరోయిన్ నివేతా థామస్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా సృజన్, సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మాణం వహించగా యువ రామా నాయుడు దగ్గుబాటి సమర్పణలో విడుదలకి వచ్చింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *