35Movie : 35 చిన్న కథ కాదు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే..?

 వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించే కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు ఈ సంవత్సరం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని 35 చిన్న కథ కాదు సినిమా ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్​గణితశాస్త్రానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తోంది. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా 35 చిన్నకథ కాదు వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​ డిసెంబర్ 22న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు.. జీ తెలుగులో ప్రసారం కానుంది.

Also Read : NBK 109 : డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే

35 చిన్న కథ కాదు సినిమా కథ లెక్కల చుట్టూ తిరుగుతుంది. తిరుపతిలో నివసించే మధ్యతరగతికి చెందిన భార్యాభర్తలు సత్యప్రసాద్​(విశ్వదేవ్​ రాచకొండ), సరస్వతి (నివేదా థామస్​​). వారికి ఇద్దరు కొడుకులు అరుణ్​(అరుణ్​దేవ్​ పోతుల), వరుణ్​(అభయ్​ శంకర్​). అరుణ్​ గణిత నియమాలు తప్పని వాటిని ఎందుకు పాటించాలంటూ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. మ్యాథ్స్​ టీచర్​ చాణక్య వర్మ(ప్రియదర్శి) అరుణ్​ని జీరో అని పిలవడంతో సరస్వతి, సత్య ఆందోళన చెందుతారు. అరుణ్​ అడిగే ప్రశ్నలేంటి? సరస్వతి తన కొడుకు సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? అనే విషయాలు తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే 35 చిన్న కథ కాదు సినిమా చూడాల్సిందే. గణిత శాస్త్రంలో అంకెలు సృష్టించే మాయాజాలం, ఆకట్టుకునే కథాంశంతో మేళవించిన అసాధారణ కథతో రూపొందిన ఈ సినిమాకి నందకిషోర్​ ఈమని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలక పాత్రలు పోషించారు. ఎమోషనల్​ అండ్​ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా అలరించిన 35 చిన్న కథ కాదు సినిమాని జీ తెలుగు వేదికగా మీరూ చూసేయండి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *