DilRaju : 5 పాటలు రూ. 75 కోట్ల ఖర్చు.. శంకర్ మార్క్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక శనివారం నాడు ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

Also Read : Allu Arjun : పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్

చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ కోసం ఏదైనా కొత్తగా చేద్దామని డల్లాస్‌లో ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. డల్లాస్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ చిత్రంలో ఐదు పాటలుంటాయి. ఈ పాటలకు రూ. 75 కోట్లు ఖర్చు అయ్యాయి. ఒక్కో పాట పది రోజులకు పైగా చిత్రీకరించారు. అన్నీ కూడా శంకర్ మార్క్‌లోనే ఉంటాయి. నా బ్యానర్‌లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించాలని అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఈ సినిమా రామ్ చరణ్‌కు అయితే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కు థాంక్స్’ అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *