దివంగత అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన తొలి సినిమా ‘శ్రీ సీతారామ జననం’. కాగా ఈ చిత్రం విడుదలై నేటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘80 వసంతాల శ్రీ సీతారామ జననం. అత్యంత పిన్న వయస్కుడైన తొలి కథానాయకుడు. మొదటి చిత్రంతోనే శ్రీరాముడి పాత్ర ధరించారు. ఈ చిత్రంలో పద్యాలు సొంతగా పాడుకున్నారు’ అంటూ పోస్టర్‌లో క్యాప్షన్ ఇచ్చారు.
అన్నట్టు ఈ సినిమా 1944లో విడుదలైన తెలుగు హిందూ పౌరాణిక చిత్రం. ఈ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, త్రిపురసుందరి, వేమూరి గగ్గయ్య, రుష్యేంద్రమణి ప్రధాన పాత్రలలో నటించారు. సంగీతం ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావు సంయుక్తంగా స్వరపరిచారు.
The post హీరోగా ఏఎన్నార్ తొలి సినిమాకు 80 ఏళ్లు first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.