లావణ్యకు వరుణ్ తేజ్ రొమాంటిక్ యానివర్సరీ విషెస్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి గతేడాది ప్రేమవివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వారి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే, వారి పెళ్లయ్యి అప్పుడే ఏడాది అవుతోంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

తన భార్యకు తొలి యానివర్సరీ విషెస్ చెబుతూ ఓ రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేశాడు వరుణ్. ఇటీవల వారు స్విట్జర్లాండ్ వెకేషన్‌కు వెళ్లినప్పుడు దిగిన ఓ ఫోటోను వరుణ్ ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. మెగా కపుల్‌గా ఈ జోడీ అందరి మన్ననలు అందుకుంటోంది.

ఇక వరుణ్ తేజ్, లావణ్య ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

The post లావణ్యకు వరుణ్ తేజ్ రొమాంటిక్ యానివర్సరీ విషెస్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *