• తారక్ – కొరటాల కాంబోలో వస్తున్న దేవర
  • అత్యంత భారీ స్థాయిలో భారీ బడ్జెట్ లో వస్తున్న దేవర
  • సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు దేవర రెడీ

జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది.

Also Read : Mookuthi Amman 2 : బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో లేడీ సూపర్ స్టార్.. దర్శకుడు ఎవరంటే..?

అటు ఒవర్సీస్ ప్రీ సేల్స్ లో దేవర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో అత్యంత వేగంగా 1.75 మిలియన్ కలెక్ట్ చేసిన ఎనీ ఇండియన్ మూవీగా రికార్డు తిరగరాసింది. అదే విధంగా బబుకింగ్స్ పరంగా ఇప్పటి వరకు 45,000 టికెట్స్ రిలీజ్ కు 10 రోజులు ఉండగా ఇంతటి భారీ స్థాయి బుకింగ్స్ సాధించిన సినిమాగా దేవర నిలిచింది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది. కాగా నేడు చిత్ర యూనిట్ తమిళ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనుంది. చిత్ర యూనిట్ నేడు చెన్నైలో ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మరోవైపు ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22 న భారీ స్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేసారు కానీ వేదిక ఎక్కడఅనే దానిపై సందిగ్థత నెలకొంది.