Poonam Kaur: ఇండస్ట్రీలో నటిగా సినిమాలలో నటించి పాపులర్ అవడం కంటే సోషల్ మీడియాలో వివాదాలు పోస్టులు పెడుతూ ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో నటి పూనమ్ కవూర్ ఒకరు. ఈమె ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టుల ద్వారా పాపులర్ అయ్యారు.

తరచూ పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గురించి ఈమె సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇండస్ట్రీలో లేదా రాజకీయాలలో ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే వాటి పట్ల స్పందిస్తూ పోస్టులు చేస్తుంటారు. ఇకపోతే తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పట్ల లైంగిక ఆరోపణలు చేస్తూ తన అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ విషయం గురించి తాజాగా పూనమ్ కవర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. జానీ మాస్టర్ ని ఉద్దేశించి ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీ నీ ఇకపై జానీ మాస్టర్ అని పిలవాల్సిన పనిలేదు. మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంటుంది. మాస్టర్ అనే పదానికి కాస్త విలువ ఇవ్వండి అంటూ పోస్ట్ చేశారు.

విలువ ఇవ్వండి…
మాస్టర్ అనే పదానికి విలువ ఎక్కువగా ఉంది అయితే ఆ పదానికి ఈయన అర్హుడు కాదు అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ వైపు కొంతమంది నెటిజన్స్ ఈమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా జానీ మాస్టర్ మాత్రం పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.