Jani Master: జానీ మాస్టర్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మారుమోగుతున్న పేరు. ఈయన తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీనితో ఒక్కసారిగా జానీ మాస్టర్ సోషల్ మీడియా వార్తలలో నిలిచారు.

తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను ఈయన లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా తనతో ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించారని ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్ కి వెళ్లిన సమయంలో తనని ఇబ్బంది పెట్టేవారు అంటూ సదురు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన గురించి ఆరోపణలు వస్తున్న ఇప్పటివరకు ఎక్కడ కూడా జానీ మాస్టర్ స్పందించలేదు.

ఇక ఈ విషయంలో జానీ మాస్టర్ మాత్రమే కాకుండా ఆయన భార్యకు కూడా సంబంధం ఉంది అంటూ సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి తరుణంలోనే గతంలో హైపర్ ఆది జానీ మాస్టర్ ని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ ఢీ డాన్స్ షో జడ్జిగా ఉన్న సమయంలో హైపర్ ఆది ఆయనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆకలి తీర్చడం..

ఈరోజు జానీ అనే నాకంటే పెద్ద బ్యాట్స్ మ్యాన్ వచ్చాడు అంట కదా. జానీలో ధోని ఉన్నాడు, ఆయన ఆట ఇప్పట్లో ఆగదు. మీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా, అమాయకుడు పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ జానీ మాస్టర్ అన్నీ డైరెక్ట్. ఆకలి తీర్చడం ఆయనకు అలవాటే’ అంటూ హైపర్ ఆది గతం లో ఢీ షో లో చేసిన కామెడీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.