Translate this News:
Cucumber Tips: ఫేషియల్ చేసే సమయంలో కీరదోసకాయను కళ్లపై పెట్టుకోవడం తరచుగా చూస్తునే ఉంటాం. ఇంట్లో ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత కూడా చాలామంది కీరదోసకాయను కళ్లపై పెట్టుకుంటారు. కీరలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైడ్రేషన్ ఉత్తమ మూలం. కంటి ఆరోగ్యానికి మేలు చేసే థయామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం వంటి గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది కచ్చితంగా కళ్లకు ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కళ్ల వాపు, చికాకు కూడా తగ్గుతుంది. అంతేకాదు డార్క్ సర్కిల్స్‌ను దూరం చేస్తుంది. దోసకాయను కళ్లపై పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..
నల్లటి వలయాలు తగ్గుతాయా..?
- కీరదోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, సిలికా పుష్కలంగా ఉన్నాయి. దీంతో చర్మానికి మెరుపు ఇచ్చి కళ్ళ బంధన కణజాలాలకు ఉపశమనాన్ని అందిస్తుంది. చుట్టుపక్కల చర్మంలో తేమ, ఆర్ద్రీకరణను, రక్త ప్రసరణను, కొల్లాజెన్‌ను పెంచుతుంది. దీనివల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. కీరదోసకాయ ముక్కను గ్రైండ్ చేసి అందులో తేనె మిక్స్ చేసి కంటి నల్లటి వలయాలపై రాసి 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే క్రమంగా నల్లటి వలయాలు తగ్గుతాయి.
కీరదోసకాయవల్ల కలిగే ప్రయోజనాలు
- దుమ్ము కారణంగా కళ్ళు ఉబ్బుతాయి. ఈ సమయంలో దోసకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంచి చల్లాగైనా తర్వాత కళ్లకు పెట్టుకుని పడుకోవాలి. కీరదోసకాయలో ఉంటే యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ కంటివాపుకు తక్షణ ఉపశమనం ఇస్తుంది.
- దోసకాయలో ఉంటే ఫైటోకెమికల్స్ కంటి చర్మం చుట్టూ ఉన్న పొడిని తొలగిస్తుంది. ముఖానికి మాస్క్‌తో పాటు దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచుకుంటే చర్మం తేమగా మారుతుంది.
- వృద్ధాప్యం ప్రభావాలు, ముడతలు, ముడతలు కళ్లపై ప్రభావం చూపుతుంది. దోసకాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దోసకాయను గ్రైండ్ చేసి దానికి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ముడతలపై రాయాలి. 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే ముఖ్యంలో ప్రభావం ఉంటుంది.
- కీర దోసకాయ కళ్లలో మంట, దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గ్రీన్ టీలో కొన్ని కీరదోసకాయ ముక్కలను వేసి, రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. అవి చల్లబడిన తర్వాత కళ్లపై ఉంచాలి. మిగిలిన ముక్కలతో ముఖాన్ని మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లు, ముఖం రెండూ రిలీఫ్‌గా మారి కాంతివంతంగా కనిపిస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
[vuukle]