Devara: పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడం ఇటు కొరటాల శివతోపాటు అటు ఎన్టీఆర్ కి కూడా చాలా కీలకంగా మారింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన ఇదివరకు నటించిన RRR సినిమా కోసం 45 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమాకు ఏకంగా 60 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.

60 కోట్లు..
ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నటి జాన్వీ కపూర్ ఐదు కోట్ల రూపాయలు విలన్ పాత్రలో నటిస్తున్న నటుడు సైఫ్ అలీ ఖాన్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైనది.