• కాలుష్యం వల్ల సంతాన లేమి సమస్య!
  • డెన్మార్క్‌లో నిర్వహించిన అధ్యయనం వెల్లడి
  • వాయు కాలుష్యం.. ట్రాఫిక్‌ శబ్దాలకు గురవటానికీ.. సంతానలేమి సమస్య సంబంధం

బ్రతుకుదెరుకు, వృత్తిరీత్యా, పలు కారణాలతో చాలా మంది జనాభా పల్లెలను వదిలి పట్టణాలకు, నగరాలకు పయణమవుతున్నారు. పల్లెల మాదిరిగా స్వచ్ఛమైన వాతావరణం నగరాల్లో ఉండదు. రోజు రోజుకూ నగరాల్లో కాలుష్యం పెరుగుతోంది. నగరాల్లోని అన్ని చోట్ల కూడా వాయు కాలుష్యం అనేది సర్వసాధారణంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వాయు కాలుష్యం గురించి చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా డెన్మార్క్‌లో నిర్వహించిన అధ్యయనం సంచలన విషయాన్ని తెలిపింది. దీర్ఘకాలంగా వాయు కాలుష్యం, ట్రాఫిక్‌ శబ్దాలకు గురవటానికీ సంతానలేమి సమస్య పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు ఇందులో తేలిసింది.

READ MORE: IND vs BAN: ముగిసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్.. భారీ ఆధిక్యంలో భారత్

కలుషిత గాలిలోని రసాయనాలు రక్తం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థలోకీ చొచ్చుకెళ్లొచ్చు. ఇవి హార్మోన్లను అస్తవ్యస్తం చేయొచ్చట. నేరుగా అండాలు, శుక్రకణాలనూ దెబ్బతీయొచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలా సంతానం కలగటంలో చిక్కులకు దారితీయొచ్చని అధ్యయనం వెల్లడించింది. అయితే ఆరోగ్యం మీద వాహన శబ్దాల ప్రభావం గురించి అంత స్పష్టంగా తెలియదు. ఇవి ఒత్తిడి హార్మోన్లను ప్రభావితం చేయటం ద్వారా సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశముందని కొన్ని పరిశోధనలు చెబుతున్న మాట మాత్రం వాస్తవం.

READ MORE:Damodar Raja Narasimha: చవకబారు విమర్శలు మానుకోండి.. దామోదర రాజనర్సింహ ట్విట్

దేశవ్యాప్త డేటా కేంద్రాల నుంచి ప్రతి ఒక్కరి సమాచారాన్నీ సేకరించారట. దీంతో ఆయా వ్యక్తుల ఆరోగ్యం, నివాస ప్రాంతం, ఉద్యోగం, చదువులు, కుటుంబం మధ్య సంబంధాల మీద అధ్యయనం చేయటం తేలికైంది. వీరిలోంచి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారిని, సంతానలేమి సమస్య నిర్ధరణ అయిన పురుషులు, స్త్రీలను గుర్తించారు. సంతానలేమి విషయంలో మగవారిలో, ఆడవారిలో కాలుష్యం భిన్నంగా ప్రభావం చూపుతున్నట్టు తేలింది. మగవారిలో గాలిలో నుసి (పీఎం2.5), ఆడవారిలో వాహనాల రొద ఎక్కువగా కారణమవుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ణయించిన దాని కన్నా పీఎం2.5 మోతాదులు 1.6 రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల మగవారిలో సంతానలేమి ముప్పు 24% పెరుగుతున్నట్టు చెప్పుకొచ్చింది. అదే 35 ఏళ్లు పైబడ్డ మహిళలకైతే సగటు వాహనాల రొద (55-60 డెసిబెల్స్‌) కన్నా 10.2 డెసిబెల్స్‌ పెరిగితే సంతానలేమి ముప్పు 14% ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. అందుకే ప్రతి ఒక్కరూ కాలుష్యానికి దురంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా పెళ్లికాని, పెళ్లయినా.. సంతానం కలగనివారు సిటీకి దూరంగా జీవించడం మంచిదని అధ్యయనం నొక్కిచెప్పింది.