• ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన సరిపోదా శనివారం
  • శనివారం సందర్భంగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనాన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్
  • నైజాం బయ్యర్స్ కు మంచి లాభాలు తెచ్చిన సరిపోదా

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయల కాంబోలో వచ్చిన ద్వితీయ చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

Also Read : VETTAIYAN : రజనీకాంత్ ‘వెట్టయాన్’ ప్రివ్యూ టీజర్ రిలీజ్..

సరికొత్త కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో నాని, SJ సూర్యల అద్భుత నటన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గతంలో నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ నిరాశపరిచినా ‘సరిపోదా శనివారం’ తో ఆ బాకీ తీర్చేసాడు. థియేటర్ రన్ దాదాపు ముగించుకున్న ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాను ఈ నెల 26న స్ట్రీమింగ్ కు తీసుకు రానున్నట్టు అధికారకంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన సరిపోదా శనివారం ఓటీటీలో ఎన్ని మిలియన్ వ్యూస్ రాబడుతుందో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.