• టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న డేవిడ్ వార్నర్
  • ఇటీవల క్రికెట్​కు స్వస్తి పలికిన వార్నర్
  • డాన్స్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వార్నర్

క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ పేరు బాగా సుపరిచితం. ఆస్ట్రేలియా ఓపెనర్​గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో విరుచుకుపడడం అతడి నైజం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా బౌండరీలు, సిక్సులతో  విజృభించడమే వార్నర్ పని. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను  ఉన్నారు. ఇక తన ఫ్యామిలీతో కలిసి వార్నర్ చేసే రీల్స్  కు మిలియన్ వ్యూస్ తెచ్చిపెట్టాయి. మరి ముఖ్యంగా పుష్ప యాక్టింగ్​కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియన్ మూవీస్ ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్స్​కు సంబంధించిన రీల్స్​తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు వార్నర్.

Also Read : SDT18 : అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో మెగా మేనళ్లుడు ‘సాయి దుర్గ్ తేజ్’..

తాజాగా క్రికెట్​కు స్వస్తి పలికిన వార్నర్  ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి రెడీ గా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన వార్త ఏంటి అంటే ఆయన డెబ్యూ మూవీ టాలీవుడ్ ఫిల్మ్​తో అనేది మరింత ఇంట్రెస్టింగ్​గా మారింది. దీంతో ఆయన ఏ మూవీ లో నటించనున్నాడనే చర్చ టాలీవుడ్ లో మొదలైంది.  అయితే కొందరు వార్నర్ కు బాగా పాపులారిటీ తీసుకొచ్చిన ‘పుష్ప – 2 ’ సినిమాతో  వెండితెర తెరంగేట్రం చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు.  తాజాగా గన్ పట్టుకున్నవార్నర్ ఫొటో ఒకటి  బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత  బలం చేకూరింది. కానీ అందుతున్న విశ్వాసనీయ సమాచారం ప్రకారం వార్నర్ ఓ తెలుగు సినిమాకు సైన్ చేసాడనేది వాస్తవం.  కానీ పుష్ప -2 ఆ లేదా వేరే ఇంకేదైనా సినిమానా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.