• సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా దేవర రిలీజ్
  • రిలీజ్ నాడు 6 షోస్ అనుమతిస్తూ ఏపీ సర్కార్ జీవో
  • టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం

అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తమ్మడు జూనియర్ ఎన్టీయార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా  భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దేవరను అత్యంత భారీ బడ్జెట్ పై రానున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన దేవర నిర్మాతలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. అందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ తమ వ్యక్తిగత ‘X’ ఖాతాలో నందమూరి బ్రదర్స్ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జూనియర్ ఎన్టీయార్ స్పందిస్తూ “గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక  ధన్యవాదాలు మరియు గౌరవనీయులైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దేవర విడుదల కోసం మేము చేసుకున్న దరఖాస్తు స్వీకరించి, అందుకు అనుగుణంగా ప్రత్యక అనుమతులు ఇస్తూ కొత్త జి.ఓను విడుదల చేసినందుకు ధన్యవాదాలు మరియు తెలుగు సినిమాకు మీరు అందిస్తున్న మద్దతుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందులదుర్గేష్ గారికి కృతజ్ఞతలు” అని ట్వీట్ చేసారు.

నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందులదుర్గేష్ దేవర గ్రాండ్ రిలీజ్ కోసం అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అని ట్వీట్ చేసారు.