Did Shankar Targeted Devara Movie: ఒకపక్క దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చర్చ జరుగుతుంటే మరోపక్క ఇండియాలోనే మరో టాప్ డైరెక్టర్ శంకర్ చేసిన ట్వీట్ గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే ఈరోజు సాయంత్రం శంకర్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. అందులో శంకర్ మాట్లాడుతూ తాను కాపీరైట్ కొనుగోలు చేసిన ఒక నవలలోని కీలక సీన్ చాలా సినిమాల్లో చూస్తూ బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఈ నవలలోని సీన్స్ ని సినిమాల్లో కానీ వెబ్ సిరీస్లలో కానీ ఇక ఏ ఇతర మాధ్యమాల్లో కూడా ఉపయోగించకుండా చూడాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Devara: ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అంతా సస్పెన్స్.. జరుగుతుందా? లేదా?

ఇప్పటికే క్రియేటర్స్ దగ్గర ఉన్న రైట్స్ ని గౌరవించండి, అధికారం లేకుండా సీన్స్ ను కాపీ కొట్టడం మానుకోండి. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఆయన హెచ్చరించారు. అయితే ఆయన ఏ సినిమా గురించి ప్రస్తావించారో క్లారిటీ లేదు కానీ ఆయన ప్రస్తావించిన తమిళ నవల వీరయుగ న్యాయ వేల్పరి కథకు దగ్గరగా దేవర సినిమా కథ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొరటాల శివ శ్రీమంతుడు సినిమా విషయంలో ఇలాంటి కాపీ వివాదం ఎదుర్కొన్నారు. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే కొంతమంది మాత్రం అది దేవర అయి ఉండకపోవచ్చు అని అంటున్నారు. అయితే శంకర్ ఏ సినిమా గురించి ప్రస్తావించారో క్లారిటీ రావాల్సి ఉంది.