ఇండియన్ స్క్రీన్ నుంచి వస్తున్న తొలి గ్లోబల్ మూవీ కల్కి. ఇప్పటికే హోల్ ఇండియాతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కూడా ఈ మెగా మూవీ రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ హైప్ ప్రీ సేల్స్లను స్పష్టంగా కనిపిస్తోంది.
ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డ్స్‌తో రీ సౌండ్ చేస్తోంది కల్కి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన గ్లోబల్ మూవీ కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథాలజీని ఫ్యూచర్‌కి లింక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే కల్కి పేరిట చాలా రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఆదివారం దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
తొలి రోజు రికార్డ్ స్థాయిలో ఐదున్నర లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. వసూళ్ల పరంగానూ ప్రీ బుకింగ్స్‌లోనే 16 కోట్ల మార్క్‌ను టచ్ చేసిందని అంచనా వేస్తున్నారు ట్రెడ్ ఎనలిస్ట్‌లు. యూఎస్‌లో కల్కి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది.
గత వారమే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా మూడు మిలియన్ల మార్క్‌కు చేరువైనట్టుగా లెక్కలు చెబుతున్నాయి. రిలీజ్‌కు మరికొంత సమయం ఉండటంతో ప్రీ సేల్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
యూకేలోనూ నెవ్వర్ బిఫోర్ రికార్డ్ సెట్ చేసింది కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను దాదాపు 400 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. యూకేలో ఈ స్థాయిలో రిలీజ్ అవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే అంటున్నారు.
ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ కల్కి మేనియా మరో రేంజ్లో కనిపిస్తుండటంతో డే వన్, ఫస్ట్ వీక్ రికార్డ్లలోనూ కల్కి నెవ్వర్ బిఫోర్ నెంబర్స్‌ను టచ్ చేయటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.