• వరుస సినిమాలతో జోరు మీదున్న సందీప్ కిషన్
  • త్రినాథరావు దర్శకత్వంలో నటిస్తున్న సందీప్
  • సీనియర్ హీరోలకు పోటీగా సంక్రాంతి రిలీజ్ కు ఏర్పాట్లు

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తరువాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో సహాయ నటుడు పాత్ర పోషించాడు సందీప్. ప్రస్తుతం ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు ద‌ర్శ‌క‌త్వంలో సందీప్‌కిషన్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్ బ్యాన‌ర్‌ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

Also Read : Devara : రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన దేవర.. ఎక్కడంటే..?

త్రినాథ రావు దర్శకత్వలో రానున్న ఈ చిత్రానికి మజాకా అనే టైటిల్ ను ఖరారు చేశారు.  సందీప్ కిషన్ అత్యంత వినోదాత్మక పాత్రలో కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సందీప్ కిషన్ సంక్రాంతి బుల్లోడుని తలపిస్తూ, ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణం కనిపిస్తుంది. సంప్రదాయ పట్టు పంచె, చొక్కా ధరించి సందీప్ కిషన్ తన భుజంపై భారీ టేప్ రికార్డర్‌తో పెద్ద కుర్చీపై కూర్చుని కనిపించాడు. ఈ సినిమాలోని ఎంటర్టైన్మెంట్ గురించి ఇండస్ట్రీ లో చాలా కాలంగా మంచి టాక్  నడుస్తోంది. వర్కౌట్  అయితే  పండగకు పెర్ఫెక్ట్ సినిమాగా మారే అవకాశం ఉంది. సీనియర్ నటుడు  రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాగా, ఈ చిత్రాన్ని ఈ సంక్రాంతికి  కానుకగా జనవరి 14న రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు మేకర్స్. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.