• దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

  • ఎట్టకేలకు అధికారికంగా స్పందించిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ

  • 30 నుంచి 35
  • 000 మంది ఈవెంట్ దగ్గరికి వచ్చారు

Shreyas Media Clarity on Devara Pre Release event Cancellation: దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అంశం మీద ఎట్టకేలకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అధికారికంగా స్పందించింది. తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక సుదీర్ఘమైన క్లారిటీ మెసేజ్ ని అభిమానుల కోసం పోస్ట్ చేసింది. అందులో ముందుగా ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో రిలీజ్ వస్తుంది అంటే అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. కానీ నిన్న జరిగిన పరిస్థితులను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నామంటూ రాసుకొచ్చారు. ముందుగా వేదిక పర్మిషన్స్ గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సోలో రిలీజ్ తో వస్తున్నారు కాబట్టి ఆయన అభిమానుల అంతరంగాలను బట్టి ముందుగా అవుట్డోర్లో ఈవెంట్ ప్లాన్ చేయాలనుకున్నాం.

అయితే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు చోట్ల అవుట్డోర్ ఈవెంట్స్ కి రెండు ముఖ్యమైన కారణాలవల్ల పర్మిషన్లు ఇవ్వడం లేదు. అదేమిటంటే గణేష్ నిమజ్జనం ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు కాబట్టి పోలీసులు పూర్తిస్థాయిలో మొహరించే పరిస్థితి లేదు. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా ఊహించేలా ఏమాత్రం లేవు కాబట్టి అవుట్డోర్ ఈవెంట్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయినా సరే మేము అవుట్డోర్లో చేయడానికి చాలా ప్రయత్నించాం కానీ మాకు అప్రూవల్ రాలేదు. కాబట్టి నోవోటల్ హాల్ నెంబర్ 3 నుంచి హాల్ నెంబర్ 6 వరకు మేము బుక్ చేశాము. దానికి కెపాసిటీ 5500 మంది కానీ పోలీసులు మాకు 4,000 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అయితే మేము దాన్ని ఫాలో అవుతూ 4,000 పాసులు మాత్రమే జారీ చేశాం.

క్రౌడ్ మేనేజ్మెంట్ పాసుల గురించి మాట్లాడాలంటే గతంలోలా కాకుండా మేము ఐడీ కార్డు లాంటి పాసులను 4000 మించకుండా ముద్రించాం. ఎప్పటిలాగా రెగ్యులర్ పాసులు లేవు, మేమేదో ఎక్కువ పాసులు ఇచ్చి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినట్లు వస్తున్న రూమర్స్ నిజం కాదు. అయితే ఇంత జాగ్రత్తగా మేము ప్లాన్ చేసినా 30 నుంచి 35,000 మంది ఈవెంట్ దగ్గరికి వచ్చారు. అందుకే ప్రతి గేటు ప్యాక్ అయిపోయింది, బారికేడ్లు విరిగిపోయాయి, పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఒక సముద్రం లా ఉంటే వేదిక మాత్రం ఒక చిన్న నదిలా ఉంది కాబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ పేర్కొన్నారు.

అయితే అభిమానుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మేము ఈవెంట్ ని క్యాన్సల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎంత బాధ పెట్టి ఉంటుందో మేము అర్థం చేసుకోగలం కానీ అన్నిటికంటే భద్రత ముఖ్యమైనది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. శ్రేయస్ మీడియాకి గతంలో రెండు మూడు లక్షల మందిని కూడా అవుట్డోర్ ఈవెంట్స్ లో మేనేజ్ చేయగలిగిన హిస్టరీ ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు అంటూ పేర్కొన్నారు. క్షమాపణలు చెబుతూ ఎంతో మంది అభిమానులు చాలా దూరం నుంచి ఎన్టీఆర్ను దగ్గరగా చూసేందుకు ఈ ఈవెంట్లో పాలుపంచుకునేందుకు వచ్చారు. కానీ ఈ పరిస్థితి ఏర్పడినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాం. మేము దీన్ని ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ గా మీకు మారుద్దామనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయింది అంటూ పేర్కొన్నారు.