Work Culture: నేటి బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అయితే వర్క్ కల్చర్ హెల్తీగా ఉన్నతవరకు చేసే పని సంతృప్తికరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే విషపూరితమైన పని కల్చర్ ఉంటే మాత్రం.. ఉద్యోగి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అనారోగ్యకరమైన పని వాతావరణం ప్రొడక్టివిటీనీ తగ్గించడమే కాకుండా, ఉద్యోగి సృజనాత్మకతను అణిచివేస్తుంది. అంతే కాదు విషపూరితమైన పని వాతావరణంలో పని చేసే ఉద్యోగులు ఆందోళన, నిరాశ,  ఒత్తిడికి ఎక్కువగా గురవుతారు.

హెల్త్ లైన్ తమ పరిశోధనలో విషపూరితమైన వర్క్ కల్చర్ సంబంధించి కొన్ని సంకేతాలను వివరించింది. ఈ సంకేతాల ద్వారా చెడు పని సంస్కృతి గల సంస్థలను గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము.. 

విషపూరితమైన పని వాతావరణాన్ని గుర్తించే 
సంకేతాలు

పనికి గుర్తింపు లేకపోవడం 

టాక్సిక్ వర్క్ కల్చర్ ఉన్న సంస్థల్లో ఎంత కష్టపడి చేసిన గుర్తింపు ఉండదు. సంస్థ కోసం కృషి చేసినప్పటికీ.. కంపెనీ నుంచి మాత్రం ఉద్యోగులకు ఎలాంటి సహకారం ఉండదు. ఇలా చేసిన పనికి గుర్తింపు లేకపోవడం నిరాశకు దారితీస్తుంది. మీరు ఇలాంటి వర్క్ కల్చర్ లోనే పని చేస్తున్నట్లైతే వీలైనంత త్వరగా వేరే చోటుకు వెళ్లడం మంచిది. 

అహంకారిత ప్రవర్తన 

విషపూరితమైన వర్క్ కల్చర్  ఉన్న ఆఫిసుల్లో సహా ఉద్యోగుల గురించి తరచూ గాసిప్స్ చేయడం, ఎదుటివారిని అణచివేయాలని చూడడం, ఎప్పుడు ఒకరే డామినేటింగ్ గా ఉండాలని ప్రయత్నించడం చేస్తుంటారు. నలుగురి ముందు తోటి ఉద్యోగిని కామెంట్ చేస్తూ ఆనందం పొందాలని చూస్తారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా పని చేయడం కష్టంగా ఉంటుంది. 

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం  

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం విషపూరితమైన పని వాతావరణాన్ని సూచిస్తుంది. ఉద్యోగులకు వ్యక్తిగత సమయం లేకుండా అధిక పని భారాన్ని ప్రోత్సహించడం.. శారీరక, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

మైక్రో మ్యానేజ్మెంట్ 

మైక్రో మ్యానేజ్మెంట్ అనేది అధిక నియంత్రణను సూచిస్తుంది. ఒక పని అప్పగించిన తర్వాత మళ్ళీ.. మళ్ళీ దాని గురించి అడగడం, పర్యవేక్షించడం ఉద్యోగి పట్ల విశ్వాసం లేకపోవడాన్ని ప్రదర్శిస్తుంది. ఇలాంటి వర్క్ కల్చర్ లో పని చేయడం ఉద్యోగి సృజనాత్మకతను ధైర్యాన్ని తగ్గిస్తుంది.

Also Read: అత్యధిక వసూళ్ళ చిత్రాల్లో శ్రద్ధా ‘స్త్రీ-2’.. ఎన్ని కోట్లో తెలుసా!