Pawan Kalyan: తిరుపతి లడ్డులో నెయ్యికి బదులు జంతువుల నూనె ఉపయోగిస్తున్నారని వార్తలు బయటకు రావడంతో ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా స్వామివారి ప్రసాదంలో కల్తీ జరగడంతో పవన్ కళ్యాణ్ ఈ తప్పుడు సరిదిద్దడం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలా 11 రోజులపాటు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు.

ఈ విధంగా ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నేడు ఉదయం విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయాన్ని శుభ్రం చేస్తూ శుద్ధి చేశారు అనంతరం మెట్లకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలా దర్శనం అనంతరం ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..హిందువుల గురించి మాట్లాడితే ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏంటి అని పవన్ ప్రశ్నించారు. నేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏమిటి.. నేను ఏ మతం గురించి అయినా మాట్లాడానా..తిరుపతిలో అపవిత్రం జరిగింది.. ఇలా జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుంది. తప్పు జరిగితే మాట్లాడకూడదా..? దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడకూడదా..

మాట్లాడితే తప్పా..
ఏం పిచ్చి పట్టింది ఎవరికోసం ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఈయన ప్రశ్నించారు. ప్రకాశ్ రాజు అంటే నాకు గౌరవం ఉంది. నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా.. మాట్లాడితే సెక్యూలరిజంకు విఘాతం అంటే ఏమిటి అంటూ ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు అదే ఇస్లాం మతం గురించి, జీసస్ గురించి మాట్లాడగలరా అంటూ ప్రశ్నించారు. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదు అంటూ పవన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి