కండరాల పెరుగుదలకు ప్రొటీన్ తప్పనిసరి. శరీరానికి తగినంత ప్రొటీన్లు అందినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజుల్లో అందరూ మార్కెట్లో దొరికే ప్రొటీన్ పౌడర్లను వాడుతుంటారు. కెమికల్స్‌తో తయారు చేసిన పౌడర్‌ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్‌ తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఈ ప్రొటీన్ పౌడర్‌ను ఇంట్లో తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. 

మూడు నెలల వరకు నిల్వ..

ప్రొటీన్ పౌడర్ చేయడానికి వేరుశెనగ, సోయాబీన్ గింజలు, పొట్నాల పప్పును తీసుకోవాలి. మీ బడ్జెట్ కాస్త ఎక్కువగా ఉంటే బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, అవిసె గింజలను సమానంగా తీసుకోవాలి. ఒక ప్యాన్‌లో అన్నింటిని వేసి లేత ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ను జల్లించి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. దాదాపు రెండు నుంచి మూడు నెలల వరకు ఈ ప్రొటీన్ పౌడర్ నిల్వ ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.